Skip to main content

📢 నవోదయ విద్యాలయాలు 6వ తరగతి అడ్మిషన్ 2026-27 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది!

 జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది..! ఇవిగో వివరాలు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు… ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్నవారు అర్హులు. ముఖ్య వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి…


జవహర్ నవోదయ నోటిఫికేషన్ విడుదల
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 2 విడతల్లో సెలెక్షన్ పరీక్షను పూర్తి చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా మొత్తం 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.వీటిల్లో ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణ 9 ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అప్లికేషన్ చేసుకునే వీలు ఉంది.
అప్లికేషన్ ప్రాసెస్….
  • జవహర్ నవోదయ అధికారిక వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/?  లోకి వెళ్లి. 
  • హోమ్ పేజీ కనిపించే JNVST ఆరో తరగతి రిజిస్ట్రేషన్ (2026-27) లింక్ పై క్లిక్ చేయాలి.
  •  ముందుగా ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ఆపై పూర్తి వివరాలను ఎంట్రీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. 
  • రిజిస్ట్రేషన్ వివరాలతో అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయాలి. 
  • చివరగా సబ్మిట్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. 
  • తదుపరి అవసరాల కోసం రిజిస్ట్రేషన్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
పరీక్ష ఎప్పుడంటే…? ఏపీ,తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13, 2025వ తేదీన ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏడాదిలో ఏప్రిల్ 11వ తేదీన జరగుతుంది.

కావాల్సిన పత్రాలు:
  • పుట్టిన తేదీ ధ్రువపత్రం 
  • రెసిడెన్స్ సర్టిఫికెట్ 
  • ఆధార్ కార్డు 
  • నిర్దేశిత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ హెడ్ మాస్టర్ ధృవీకరించిన సర్టిఫికేట్ 
  • మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ 
  • మైగ్రేషన్ సర్టిఫికెట్ 
  • దివ్యాంగ విద్యార్థులు అయితే సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి 
  • కుల ధ్రువీకరణపత్రం 
  • ఆదాయ ధ్రువీకరణపత్రం 
  • అడ్మిషన్ సమయంలో టీసీ సమర్పించాలి.
పరీక్షా విధానం : నవోదయ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 80 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 2 గంటల సమయం ఉంటుంది. 

మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు, 
  1. అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు, 
  2. లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు. 

Comments

Post a Comment

Popular posts from this blog

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ACIO రిక్రూట్‌మెంట్ 2025 3717 ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయబడింది / Intelligence Bureau (IB) ACIO Recruitment 2025 Notification Released for 3717 Executive Vacancies

  INTELLIGENCE BUREAU ( IB) ACIO Recruitments for Grade II/Executive Posts : ఐబీ ఏసీఐఓలో 3,717 ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తులు.. 1,42,400తో ఉద్యోగం.. మూడు ద‌శ‌ల్లో ఎంపిక‌.. ఐబీ.. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (ACIO) గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, ఇంద‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు కూడా సాగుతున్నాయి. ఐబీ.. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (ACIO) గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, ఇంద‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు కూడా సాగుతున్నాయి. ఇందులో, మొత్తం 3,717 ఖాళీలు ఉండ‌గా, ఇటీవలి సంవత్సరాలలో అతిపెద్ద నియామకాలలో ఒకటిగా నిలిచింది.  👉అర్హ‌త‌లు: అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి, డిగ్రీ కలిగి ఉండాలి. దీనితోపాటు, వారి వ‌య‌సు ఆగ‌స్ట్ 10వ తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి (రిజర్వ్డ్ కేటగిరీలకు సడలింపులతో) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC/STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్. మాజీ స...

పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - ఎంటీఎస్‌, హవల్దార్ ఉద్యోగాలు... Central Government Jobs with 10th Qualification – MTS and Havaldar Posts"

  Central Government Jobs: కేంద్ర కొలువులకు సిద్ధమేనా? పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువుదీరే అవకాశం వచ్చింది. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) నాన్‌ టెక్నికల్, హవల్దార్‌ పోస్టులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. తొలి నెల నుంచే సుమారు రూ.35,000 వేతనం అందుకోవచ్చు. తాజాగా ప్రకటించిన 1075 ఖాళీలూ హవల్దార్‌ విభాగంలోనివే. ఎంటీఎస్‌ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. ఈ విభాగంలో సుమారు 4000 ఖాళీలు భర్తీ చేయొచ్చు. దాదాపు ఏటా వెలువడుతోన్న ఉద్యోగ ప్రకటనల్లో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ అండ్‌ హవల్దార్‌ ఒకటి. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు.  మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్,  హవల్దార్‌  రెండూ లెవెల్‌-1 ఉద్యోగాలే.  వీరికి రూ.18వేల మూలవేతనం అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. మొదలైనవాటితో తొలి నెల నుంచే సుమారు రూ.35,000 జీతం అందుకోవచ్చు.  మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టుల్లో చేరినవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వహిస్తారు. ...

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో 10th అర్హతతో కొత్తగా కానిస్టేబుల్ 3588 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | BSF Constable Tradesman Recruitment 2025

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు డైరెక్ట్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  25.08.2025 నాటికి 18 to 27 సంవత్సరాల, వయసు సడలింపు ఉంటుంది.  పురుష అభ్యర్థులకు 3406 ఖాళీలు  మహిళా అభ్యర్థులకు 182 ఖాళీలు ఖాళీలు  భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. 21,700-69,100/-  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించదగిన ఇతర అలవెన్సులు ఇస్తారు.  అర్హులైన అభ్యర్థులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  ముఖ్యమైన తేదీలు 👉 దరఖాస్తు ప్రారంభ తేదీ  : 26 జులై 2025 👉  దరఖాస్తు చివరి తేదీ  : 25 ఆగష్టు 2025 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్, అభ్యర్థి https://rectt.bsf.gov.in/ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను నమోదు చేసుకోవాలి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఖాళీల ...