పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు... Central Government Jobs with 10th Qualification – MTS and Havaldar Posts"
Central Government Jobs: కేంద్ర కొలువులకు సిద్ధమేనా?
పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువుదీరే అవకాశం వచ్చింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నాన్ టెక్నికల్, హవల్దార్ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. తొలి నెల నుంచే సుమారు రూ.35,000 వేతనం అందుకోవచ్చు. తాజాగా ప్రకటించిన 1075 ఖాళీలూ హవల్దార్ విభాగంలోనివే. ఎంటీఎస్ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. ఈ విభాగంలో సుమారు 4000 ఖాళీలు భర్తీ చేయొచ్చు.
దాదాపు ఏటా వెలువడుతోన్న ఉద్యోగ ప్రకటనల్లో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఒకటి. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్,
- హవల్దార్
రెండూ లెవెల్-1 ఉద్యోగాలే.
వీరికి రూ.18వేల మూలవేతనం అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. మొదలైనవాటితో తొలి నెల నుంచే సుమారు రూ.35,000 జీతం అందుకోవచ్చు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ పోస్టుల్లో చేరినవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వహిస్తారు.
హవల్దార్‌గా ఎంపికైనవారు కేంద్ర రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తారు. కేంద్రంలోని పరోక్ష పన్నుల విభాగాలు, నార్కోటిక్ బ్యూరోలో సేవలందిస్తారు.
ఎంపిక విధానం
ఇందులో 2 సెషన్లు. 270 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ 3 చొప్పున 90 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో సెషన్ వ్యవధి 45 నిమిషాలు. సెషన్-1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 20, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు లేవు. సెషన్-2లో జనరల్ అవేర్‌నెస్‌లో 25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఈ సెషన్‌లో తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
పరీక్షలో అర్హత కోసం ప్రతి సెషన్‌లోనూ జనరల్ 30, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతర విభాగాలవారు 20 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కుల పొందినవారి జాబితా నుంచి సెషన్-2 మార్కుల మెరిట్‌తో, రిజర్వేషన్ల ప్రకారం ఎంటీఎస్ ఉద్యోగంలోకి తీసుకుంటారు.
హవల్దార్ పోస్టులకు మాత్రం.. సెషన్-2 మెరిట్‌తో విభాగాల వారీ ఒక్కో ఖాళీకి 7 మందిని చొప్పున ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి. మహిళలు ఒక కిలోమీటర్‌ని 20 నిమిషాల్లో చేరుకోవాలి. ఫిజికల్ స్టాండర్డ్స్‌లో భాగంగా.. పురుషులు 157.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ విస్తీర్ణం ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరిగి 81 సెం.మీ. తక్కువ కాకుండా ఉండాలి. మహిళలు 152 సెం.మీ. ఎత్తు, 48 కి.గ్రా. బరువు అవసరం.

పోస్టుల వివరాలు : MTS – ఖాళీల వివరాలు తర్వాత చెప్పనున్నారు, హవల్దార్ – 1,075
దరఖాస్తు విధానం & గడువు : : ఆన్‌లైన్ పద్దతిలో జూలై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఎడిట్ ఆప్షన్ : జూలై – 29 నుంచి 31వ తేదీ వరకు
SSC MTS 2024 పరీక్ష : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (టైర్ 1) సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 24 వరకు.
రుసుము : రూ. 100/- రూపాయలు. (SC /ST/ PWD/ Ex- servicemen వర్గానికి చెందిన అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు)
వయోపరిమితి :
- ఆగస్టు 1, 2025 నాటికి ఎంటీఎస్ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఆగస్టు 2, 2000 - ఆగస్టు 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు.
- హవల్దార్, ఎంటీఎస్‌లో కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వరకూ అవకాశం ఉంది.
- వీటికి ఆగస్టు 2, 1998 - ఆగస్టు 1, 2007 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
విద్యార్హత : మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
ఎంపిక విధానం : ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) (హవాల్దార్ పోస్టుకు మాత్రమే) ఉంటాయి.
వెబ్‌సైట్: Application Link
Comments
Post a Comment